ఆడవాళ్ల కోసం వికీపీడియాతో పోరాడింది

ఆడవాళ్ల కోసం వికీపీడియాతో పోరాడింది

ఆడవాళ్లు చదువుకొని అన్ని రంగాల్లో పైకి వస్తున్నా.. తక్కువగా చూడటం మాత్రం తగ్గడంలేదు. అలాంటిదే జెస్సికా వేడ్‌‌కూ జరిగింది. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం మహిళల్ని,  మైనారిటీలని వేరుచేసి చూసేది. దాన్ని సహించని వేడ్‌‌, వివక్ష చూపేవాళ్లపై పోరాడింది. అందుకు ఆమెని ప్రెస్టీజియస్‌‌ బ్రిటిష్‌‌ ఎంపైర్ మెడల్‌‌ ఇచ్చి సత్కరించారు.

ముప్పై మూడేండ్ల వేడ్‌‌ లండన్‌‌లో ఫిజిసిస్ట్‌‌ (సైంటిస్ట్‌‌). ఇరవయ్యేండ్ల వయసునుంచి మహిళా సైంటిస్ట్‌‌లు, మైనారిటీలు, సక్సెస్‌‌ స్టోరీలు రాసి వికీపీడియాలో పోస్ట్‌‌ చేసేది. ఆమె రాసిన ఆ స్టోరీలని వికీపీడియా వాళ్లు డిలిట్‌‌ చేసేవాళ్లు. వీళ్లంతా వివక్ష చూపుతున్నారని అప్పుడు తనకు అర్థం కాలేదు. తరువాత లండన్‌‌లో ఫిజిసిస్ట్‌‌ (సైంటిస్ట్‌‌)గా చేరాక ఆమెలాంటి వాళ్లకు ఎవరూ సరిగా రెస్పెక్ట్‌‌ ఇచ్చేవాళ్లు కాదు. అలాగే చేసిన పనికి ప్రోత్సాహం కూడా ఉండకపోయేది. దాంతో, ఒక పక్క పని చేస్తూనే 1,600 ఉమెన్‌‌ స్టోరీలు రాసి వికీపీడియాలో అప్‌‌లోడ్‌‌ చేసింది. వాటిని కూడా డిలిట్‌‌ చేశారు. 
దాంతో జెండర్ ఈక్వాలిటీ కోసం పోరాటం మొదలుపెట్టింది. అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్లు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. చివరికి వికీపీడియా ఫౌండర్‌‌‌‌ జిమ్మీ వేల్స్‌‌ ఆమె రాసిన పోస్ట్‌‌లను తిరిగి అప్‌‌లోడ్‌‌ చేయించాడు. ‘ఆడపిల్లలు సైన్స్ చదువుతామంటే చాలామంది ఒప్పుకోరు. ఇంకొందరికి పిల్లలకు సైన్స్‌‌పై అంత ఇంట్రెస్ట్‌‌ ఉండదు. వాళ్లకు ఆదర్శ మహిళల స్టోరీలు ఎక్కడా కనిపించవు. ఇకవాళ్లకు చదవాలని ఎలా అనిపిస్తుంది. ఆడవాళ్లు స్టెమ్‌‌ (సైన్స్‌‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌‌, మ్యాథ మెటిక్స్‌‌) చదవాలి. పైకి రావాలి’ అంటుంది వేడ్‌‌.