మధుయాష్కీ ఇంట్లో మాజీ ఎంపీల భేటీ

మధుయాష్కీ ఇంట్లో మాజీ ఎంపీల భేటీ

కాంగ్రెస్ నేత మధుయాస్కి ఇంట్లో మాజీ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో సురేశ్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ లు పాల్గన్నారు. మొదటి జాబితాలో నేతలు ఆశిస్తున్న సీట్లు లేకపోవడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పార్టీలో బీసీల టికెట్స్ పై లొల్లి కంటిన్యూ అవుతోంది. తాజాగా మాజీ పీసీసీ చీఫ్ పొనాల లక్ష్మయ్య కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు. కొద్దిరోజులుగా బీసీ టికెట్ల పై తమ డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు లీడర్లు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎంపీలు భేటీ కావడంతో చర్చనీయాంశమైంది. 

ఎల్బీనగర్‌ టికెట్‌ను మధుయాష్కీ ఆశిస్తుండగా..  మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.