డిప్రెషన్‍ పోవాలంటే ఇవి తినాల్సిందే!

డిప్రెషన్‍ పోవాలంటే ఇవి తినాల్సిందే!

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే డిప్రెషన్‍ నుంచి బయట పడొచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, స్వీట్లూ మానేసి పోషకాహారం తీసుకుంటే 32 శాతం మందికి డిప్రెషన్‍ తగ్గిందట.

శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రెషన్‍ లక్షణాలు కనిపిస్తాయి. దీనికి ముడి ధాన్యా లు, సీ ఫుడ్ పాటు మేక లేదా కోడి కాలేయం తినాలి.

విటమిన్‍ డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఉదయపు ఎండలో తిరగడం, చేపలు, పుట్టగొడుగులూ తినాలి.

ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం డిప్రెషన్‍కి దారితీస్తుంది. చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్ నట్స్ లో ‘విటమిన్‍- డి’ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తినొచ్చు.

విటమిన్‍ బి 12, విటమిన్‍ బి9 లోపం వల్ల కూడా డిప్రెషన్‍కి గురవుతారు. పాలు, గుడ్లు, చేపలతో పాటు ఆకు కూరలు, పండ్లు, బీన్స్ వంటివి తీసుకోవాలి. ట్రిప్టోఫా న్‍ అనే ప్రొటీన్‍ ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్‍ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది బీన్సు , పప్పు దినుసుల్లో ఉంటుంది. అవి తింటే మేలు.