
హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరున్నర లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి కారులో అక్రమంగా తరలిస్తు్ండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ లో విద్యార్థులు, యువకులను లక్షంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేల్చారు. ఈజీగా డబ్బులు ఆర్జిస్తూ గంజాయి ముఠా జల్సాలు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మొహమ్మద్ సలీమ్ ఆయుబ్ షేక్, వెంకట్ బల్లప్ప, శివమోల్ లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నారు.