
చార్ ధామ్ యాత్ర మే 10 శుక్రవారం ప్రారంభం అయింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొండ ప్రాంతాల్లో గంటల తరబడి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనం ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు ఎగబడుతున్నారు. శనివారం ( మే 11)ఉదయం.. కొండ ప్రాంతాల్లో భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. దీంతో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల పొడవునా భక్తులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులను శుక్రవారం తెరిచారు. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ నాలుగు ఆలయాలను అక్షయ తృతీయ పండగ సందర్భంగా.. శుక్రవారం తెరిచారు.
చార్ ధామ్ యాత్ర మొదలు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. దీంతో దర్శనాల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. ఇక కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచిచూసిన భక్తులు.. ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. యాత్రికుల భద్రత, రద్దీ నిర్వహణకు సంబంధించి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. దీంతో ఇరుకైన రహదారిలో సుమారు రెండు గంటలకు పైగా నిలబడ్డామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్‌లో నిర్వహణ ఏర్పాట్లు చేస్తే.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం భక్తులతో కొనసాగుతున్న రద్దీ వల్ల.. ఇరుకైన కొండ ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
యమునోత్రి ధామ్ తలుపులు తెరవగానే ఆలయ ప్రాంగణంలో జై మా యమునా నినాదాలు మారుమ్రోగాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణి రావడంతో క్రౌడ్ బాగా ఎక్కువైంది. ప్రారంభ వేడుకల్లో ఆర్మీ గ్రెనేడియర్ రెజిమెంట్ భక్తి ట్యూన్లను వాయించారు. ఆలయాలను పూలతో అలంకరించారు. హెలికాప్టర్ ద్వారా పుణ్యక్షేత్రం వద్ద గుమిగూడిక యాత్రికులపై ఆర్మీ పూల వర్షం కురిపించింది.
अव्यवस्था होगी तो सवाल पूछे ही जाएंगे। @pushkardhami देखिए, यमुनोत्री धाम की तस्वीर। pic.twitter.com/J2GI3c4sEi
— SANJAY TRIPATHI (@sanjayjourno) May 11, 2024
ఈ క్రమంలోనే యమునోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న పరిస్థితికి సంబంధించిన వీడియోలను ఓ భక్తుడు ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ట్యాగ్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేశాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, అతని భార్య మరియు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభ వేడుకలకు హాజరై, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి వేద పండితుల సమక్షంలో భక్తులకు స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ పాత్రను కొనియాడుతూ... ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, కేదార్‌నాథ్ పోర్టల్‌ల ఉత్సవ ప్రారంభాన్ని భక్తులు వీక్షించారు.
చార్‌ధామ్ యాత్రలో భాగంగా ప్రతీ సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.