మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రకంపనలు భారత స్టాక్ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం హోలీ హాలిడే తర్వాత తెరచుకున్న మార్కెట్లు నిమిషాల్లోనే ఊహించని భారీ నష్టాల్లోకి దిగజారాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2 శాతానికిపైగా నష్టపోయి 1750 పాయింట్లు ఆవిరైంది. అలాగే మరో కీలక సూచీ నిఫ్టీ 526 పాయింట్లకు పైగా పతనమైంది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 1226 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1340 పాయింట్లకు పైగా నష్టాలతో ఇంట్రాడేలో ఉదయం 10 గంటల సమయంలో కొనసాగుతున్నాయి.
యుద్ధ ప్రభావంతో అమెరికా నుంచి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి. ఇదే క్రమంలో రూపాయి మారకపు విలువ కూడా రూ.92 మార్కును అధిగమించి మరింతగా బలహీనపడింది. ప్రధానంగా యుద్ధం వల్ల చమురు సరఫరా ఇబ్బందులతో ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటంతో పాటు ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని బ్రోకరేజీల అంచనాలు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.
ఇక మార్కెట్లను ప్రభావితం చేస్తున్న ఇతర కారణాల విషయానికి వస్తే.. ఇరాన్ పై యుద్ధం 5వ రోజుకు చేరటం. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్ బాంబుల మోత మోగించటంతో పాటు తన శత్రువులకు సాయం చేస్తున్న దేశాలపై కూడా ఇరాన్ అకాట్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రభావంతో సరఫరా అడ్డుంకులతో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 19 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. సౌత్ కొరియా స్టాక్ మార్కెట్లు లోయల్ సర్య్కూట్ కొట్టడంతో 20 నిమిషాలు ట్రేడింగ్ ఆపగా ఆ తర్వాత ఓపెన్ కాగానే మరో 11 శాతం కుప్పకూలాయి. ఆందోళనలు కొనసగాటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకుసాగటమే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణంగా నిపుణులు అంటున్నారు.
