ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి.. 

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి.. 

ఏపీలోని చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ( మార్చి 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది.

ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు పోలీసులు.

కారు అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టిందని ప్రాధమికంగా నిర్దారించారు పోలీసులు. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.