
కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఇతరుల కళ్ళు పడకుండా 'దిష్టి బొమ్మ'ను వేలాడదీస్తారు గుర్తుంది కదూ.. అచ్చం అలానే ఓ వ్యాపారస్తుడు తన షాప్ ముందు ఓ మహిళ ఫోటో వేలాడ దీశాడు. ఎందుకంటారా..! తన వ్యాపారంపై నరుల దిష్టి పడకుండా..! ఇంతవరకూ బాగానే ఉన్నా.. వేలాడదీసిన ఆ ఫోటో ఎవరనేదే ఇక్కడ సస్పెన్స్.
బెంగుళూరులోని ఓ కూరగాయల దుకాణంలో వేలాడుతున్న మహిళ ఫోటోను ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటో చూశాక తాను నవ్వుకున్నానని అర్థం వచ్చేలా.. నేను ఈ రోజు బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని నెటిజెన్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఫోటోల గల స్త్రీ విశాలమైన కళ్లతో కోపంగా చూస్తున్నట్లు ఉంది.
I am so glad I stepped out today pic.twitter.com/nJx6PZUuUV
— Niharika ? (@Niharika__rao) May 10, 2024
పెళ్లాం ఫొటో కాదు కదా..!
దిష్టి తగలకుండా.. వ్యాపారి ఆలోచన బాగానే ఉన్న ఆ ఫోటో ఎవరనే దానిపై నెట్టింట భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి క్షణం భార్య గుర్తొచ్చేలా అతను అలా వేలాడదీశారని నెటిజన్స్ చమత్కరిస్తున్నారు.
It’s hard to not fall in love when someone looks at you like that
— aakashgard (@akaashvaid) May 11, 2024