వికారాబాద్ లో వర్ష బీభత్సం : కూలిన చెట్లు

వికారాబాద్ లో వర్ష బీభత్సం : కూలిన చెట్లు

వికారాబాద్ జిల్లా పరిగిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అరగంట పాటు పడ్డ వర్షానికి పరిగి పట్టణంలోని పలు కాలనీల్లో చెట్లు విరిగిపడ్డాయి. ప్లేక్సీలు చిరిగి రోడ్లపై పడ్డాయి. ఎంపిడిఓ కార్యలయం ముందు భాగంలో ఉన్న చెట్టుతో పాటు పోలీసు స్టేషన్లో ఉన్న టేకు చెట్టు విరిగిపడింది.వాస్తు విహార్ కాలనీలో ఇళ్ళ మధ్యలో ఉన్న ఓ పెద్ద చెట్ట విరిగిపడింది. ఎమ్మార్వో కార్యాలయం ముందు వేప చెట్టు విరిగి విద్యుత్ తీగల పై పడండంతో పరిగి పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనివాస కాలనిలో ఓ ఇంటి ఎలివేషన్ కోసం వేసిన పెద్ద గాజు ఫలక ఈదురు గాలికి లేచి రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందు పడింది. మనుషులెవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.   పరిగి బీసీ కాలనీలో భారీగా చేరిన వరద నీరు చేరింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులు 40 నుండి 50 గంటల వేగంతో వీచాయని స్థానికులు చెబుతున్నారు.