ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆమనగల్లు/కల్వకుర్తి, వెలుగు: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు.

ఆమనగల్లు మండలం రాంనుంతల చిన్న తండాలో మాజీ ఎంపీటీసీ సరిత పంతునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుల్జా భవాని మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. 2 లక్షల విరాళం అందజేశారు. కల్వకుర్తిలో నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.