మరికల్లో అడుగడుగునా ఎమ్మెల్యే నిలదీత

మరికల్లో అడుగడుగునా ఎమ్మెల్యే నిలదీత

మరికల్, వెలుగు: మండలంలోని రాకొండ, పూసల్​పాహడ్, పెద్దచింతకుంట, వెంకటాపూర్​ గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే ఎస్​ రాజేందర్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇందులోభాగంగా రాకొండలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా డబుల్​ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని గ్రామస్తులు నిలదీశారు. పెద్దచింతకుంటలో దళితబంధు పథకం తమకు ఇవ్వరా? అని ప్రశ్నించారు.

వెంకటాపూర్​లో గ్రామ పంచాయతీ బిల్డింగ్​కు ఫండ్స్​ మంజూరైతే క్యాన్సిల్​ చేయించారని, సీసీ రోడ్లు ఎందుకు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే ప్రసంగాన్ని కాంగ్రెస్​ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామాన్ని అభివృద్ది చేయకుండా ఎందుకు వచ్చారని ఆందోళన చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్​ నాయకులు వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు కలుగ జేసుకుని ఇరువర్గాల వారిని పక్కకు పంపించారు. ఎమ్యెల్యే వాహనంతో పాటు ప్రచార రథాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు పక్కకు నెట్టి వాహనాలను పంపించారు.