కరోనా పేషెంట్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

కరోనా పేషెంట్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

చెన్నై: కరోనా పాజిటివ్ సోకిన గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉందని, కరోనా సోకలేదని పెరుందురై ఐఆర్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. హాస్పిటల్ లో ఇప్పటికే ఈరోడ్ జిల్లాకు చెందిన 14 మంది మహిళలు కరోనా ట్రీట్​మెంట్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఈరోడ్ జిల్లాలో నమోదైన 60 పాజిటివ్ కేసుల్లో థాయ్​లాండ్​కు చెందిన ఆరుగురితో సహా మిగతావారంతా పెరుందురైలోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నారు. మరో నలుగురు కోయంబత్తూర్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రిలో ఉన్నారు. మూడు వారాల కిందట మతప్రచారం కోసం వచ్చిన ఏడుగురు థాయ్ లాండ్ మెంబర్లు, కొల్లాయపాలెంలోని ఓ కాంప్లెక్స్ లో బోధనలు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడుగురిలో ఒకరు కిడ్నీ వ్యాధితో చనిపోగా.. మితగా ఆరుగురికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. వీరు తిరిగిన ప్లేసుల్లోని వారందరినీ టెస్టులు చేయగా 54 మందికి వైరస్ సోకినట్లు తేలిందని తెలిపాయి. ఇక్కడి పది ప్రాంతాల్లోని 33,330 కుటుంబాలను హోం క్వారంటైన్ లో ఉంచామని వెల్లడించాయి.