ఎలాంటి పరీక్షలు లేకుండానే SBI 444 పోస్టుల భర్తీ

ఎలాంటి పరీక్షలు లేకుండానే SBI 444 పోస్టుల భర్తీ

ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 స్పెషలిస్టు ఆఫీసర్ల(SO) పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ ద్వారా వచ్చే నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ రెజ్యూమ్, ఏజ్ సర్టిఫికెట్, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష రాయాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వంద మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగం ఆఫర్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో కటాఫ్ మార్కులు ఏ ఇద్దరికైనా ఒకేలా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేస్తామని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.