కుంకుమ పువ్వు సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

కుంకుమ పువ్వు సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కాశ్మీర్ కుంకుమ్మ పుప్వు సాగు చేయాలంటే చాలా ఓపిక, శ్రద్ధ అవసరం. అయితే ఈ పనిని ఒకప్పుడు లోయ ప్రాంతాల్లో ఉండే రైతులు మాత్రమే చేసేవారు. కానీ.. ఇప్పుడు ఈ పద్దతి నెమ్మది నెమ్మదిగా మహారాష్ట్రకు కూడా పాకింది. పూణెకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శైలేష్ మోదక్ రైతుగా మారి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు. హైటెక్ టెక్నాలజీతో కేవలం 160 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే పంట పండిస్తూ.. లక్షలు సంపాదిస్తున్నారు. 

ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వును మొదటిసారిగా రూ.10వేల పెట్టుబడితో సాగు చేశానని శైలేష్ తెలిపారు. కుంకుమ పువ్వు సాగు కోసం కాశ్మీర్ నుంచి విత్తనాలు తీసుకువచ్చానని, దీని కోసం ఏరోఫోనిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నానని చెప్పారు. ఇదంతా కూడా కేవలం 160 అడుగుల విస్తీర్ణమున్న కంటైనర్ లోనే చేస్తున్నట్లు తెలిపారు. కుంకుమ పువ్వు సాగు కోసం వాతావరణానికి అనుగుణంగా హైటెక్ పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు.