ముంబైలో కాజల్ ఇల్లు చూశారా.. వీడియో

ముంబైలో కాజల్ ఇల్లు చూశారా.. వీడియో

కాజల్ అగర్వాల్. పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉంటూనే…. బాలీవుడ్ లో మంచి నటి అనిపించుకుంది. హోమ్ సిటీ ముంబైలో ఇటీవలే తన సొంత ఇల్లును సరికొత్తగా ముస్తాబు చేసుకుంది. ఓ వీడియో రూపంలో.. తన ఇంటి స్పెషాలిటీ ఏంటో ఆమె వివరించింది. తన మనసుకు నచ్చినట్టుగా… సింపుల్ గా ఉంటూనే.. కలరింగ్ లో థీమ్ ను ఫాలో అవుతూ.. కంఫర్ట్ గా ఉండే ఇల్లును డిజైన్ చేసుకున్నానని చెప్పింది. ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయంటూ చెప్పిన కాజల్ అగర్వాల్… తన ఇంట్లో తానేం కావాలనుకుంటున్నానో.. అవన్నీ.. ఉండేలా చూసుకున్నానని చెప్పింది. ఓ పెయింట్ బ్రాండ్ కోసం… ఈ వీడియోన షూట్ లో ఆమె పాల్గొంది.

సుషాంత్ సింగ్ రాజ్ పూత్, కల్కి కొచ్లిన్, రాధిక ఆప్టే, జోయా అక్తర్, సౌరవ్ గంగూలీ లిస్టులో లేటెస్ట్ గా కాజల్ అగర్వాల్ చేరిపోయింది. Where The Heart Is అనే ప్రోగ్రామ్ లో తన సొంత ఇంటి ముచ్చట్లన్నీ చెప్పింది కాజల్ అగర్వాల్. కాన్సెప్ట్, థీమ్ హోమ్ గురించి కాజల్ మాటల్లోనే మీరూ వినండి.