నాతో మాట్లాడు..లేకపోతే నీ దరఖాస్తు రిజెక్ట్ చేస్తా

నాతో మాట్లాడు..లేకపోతే నీ దరఖాస్తు రిజెక్ట్ చేస్తా

నేరడిగొండ , వెలుగు : హలో  నీకు ఇన్​కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలా   అయితే నాతో మాట్లాడు.. లేకపోతే నీ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తా’  అంటూ తహసీల్దార్​ఆఫీసులో అటెండర్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అతడిని పట్టుకుని చితకబాదారు.  ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండకు చెందిన ఓ వివాహిత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్​ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంది. అందులో ఆమె ఫోన్ నంబర్ ఉండగా ఆఫీసులో అటెండర్ గా పని చేసే అశోక్  ఫోన్​లో ఫీడ్​ చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఆమెకు అసభ్యకర మెసేజ్​లు పంపడంతో పాటు వాట్సాప్​లో వాయిస్ ​మెసేజ్​లు పంపించాడు. 

తన పేరు రవి అని, తహసీల్దార్​ఆఫీసులో పని చేస్తానని సర్టిఫికెట్స్ కావాలంటే తనతో మాట్లాడాలని కోరాడు. లేకపోతే సర్టిఫికెట్స్, రేషన్ కార్డు అన్నీ రిజెక్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వారు గురువారం తహసీల్దార్​ ఆఫీసుకు వచ్చి జూనియర్ అసిస్టెంట్ రవిని నిలదీశారు. ఆ వాయిస్ తనది కాదని చెప్పడంతో ఎవరై ఉంటారా అని ఆరా తీశారు. వాట్సాప్​లో పంపించిన వాయిస్​ రికార్డు ఆధారంగా అది అశోక్​ వాయిస్​ అని గుర్తించారు. తర్వాత అతడిది మండలంలోని వడూర్​ అని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అశోక్​ను పట్టుకొని చెప్పులతో కొట్టి పోలీసులకు అప్పగించారు.