తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమి డైరెక్టర్ వీకే సింగ్ పై బదిలీ వేటు

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమి డైరెక్టర్ వీకే సింగ్ పై బదిలీ వేటు

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమి డైరెక్టర్ వీకే సింగ్ పై బదిలీ వేటు పడింది. డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ రిక్రూట్ మెంట్ చైర్మన్ శ్రీనివాసరావు కు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా గత కొంత కాలంగా  ప్రభుత్వంపై వీగే సింగ్ అసంతృప్తిలో ఉన్నారు. తాను చేసిన సేవలకు ప్రభుత్వం.. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వార్తలకెక్కారు. ఈ క్రమంలో ఈనెల 24న కేంద్ర హోం శాఖ మంత్రికి ఫ్రి మెచ్యూర్ రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. తాజాగా వీగే సింగ్ ను బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది