Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన

Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన

సీరియల్ నటులు చంద్రకాంత్(Chandrakanth), పవిత్ర జయరాం(Pavitra Jayaram) మరణవార్తలు సీరియల్ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపాయి. గత ఆదివారం నటి పవిత్ర కారు ప్రమాదంలో మృతిచెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రకాంత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణంతో చంద్రకాంత్ తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రకాంత్ తల్లి ఆవేదన ప్రతీ ఒక్కరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

ఈ సందర్బంగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాని ఆమె.. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసింది అంటూ విలపించింది.. నా కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసింది. గత 5 సంవత్సరాలుగా నా కొడలిని, కొడుకుని కలవకుండా చేసింది. ఇంటికి రానిచ్చేది కాదు, భార్య పిల్లలతో మాట్లాడనిచ్చేకాదు. మాకు పెళ్లయింది, ఇక నుండి నాతోనే ఉంటాడని చెప్పింది. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. కానీ, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చందు తల్లి.

ఇక ఇదే విషయంపై చంద్రకాంత్ తండ్రి వెంకటేష్ కూడా స్పందించారు.. పవిత్రతో రిలేషనల్ లో ఉన్నప్పటినుండి మమ్మలి, భార్యని, పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు ఇంటికే రాలేదు. పవిత్ర చనిపోయాక డిప్రెషన్లోకి వెళ్ళాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు, నేనుఉండను పవిత్ర దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. అలా చేసుకోవద్దు అని చెప్పాము కానీ, వినలేదు. ఆ తరువాత రోజు లాకిడీకాపూల్ వెళ్లివస్తా అని వెళ్లిన చందు.. ఇలా ఆత్మహత్య చేసుకొని కనిపించాడు.. అంటూ చెప్పుకొచ్చాడు చంద్రకాంత్ తండ్రి వెంకటేష్.