పోక్సో కేసుల్లో తెలంగాణ ఆరో స్థానం.. మహిళలపై సైబర్ నేరాల్లో ఐదో ప్లేస్

పోక్సో కేసుల్లో తెలంగాణ ఆరో స్థానం.. మహిళలపై సైబర్ నేరాల్లో ఐదో ప్లేస్
  •     రాష్ట్రంలో మూడేండ్లలో భారీగా పెరిగిపోయిన కేసులు
  •     2019-21 వివరాలను వెల్లడించిన కేంద్రం
  •     2021లో దళితులపై నేరాలకు సంబంధించి 1,772 కేసులు
  •     దోషులకు శిక్షలు పడుతున్నది అంతంత మాత్రమే
  •    పిల్లలు, మహిళలు, దళితులపై నేరాలు ఎక్కు వైనయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పిల్లలు, మహిళలు, దళితులపై నేరాలు పెరుగుతున్నాయి. మహిళలే టార్గెట్‌‌‌‌గా సైబర్ నేరాలూ ఎక్కువవుతున్నాయి. మూడేండ్లలో కే సులు భారీగా పెరిగాయి. కానీ ఆయా కేసుల్లో దో షులుగా తేలుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటున్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌‌‌‌లో తాజాగా వెల్లడించిన వివరాలే ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. లోక్‌‌‌‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్​ బ్యూరో (ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ) డేటా ఆధారంగా సమాధానాలిచ్చింది.

పోక్సో కేసులు ఏటేటా పెరుగుతూనే ఉన్నయ్

దేశవ్యాప్తంగా నమోదవుతున్న పోక్సో కేసుల్లో తె లంగాణ ఆరో స్థానంలో ఉంది. 2019లో 1,998 పోక్సో కేసులు నమోదు కాగా.. కేవలం 108 మందిని దోషులుగా తేల్చారు. 2020లో 2,074 కేసులకుగానూ 120 మందికి శిక్షలు పడ్డాయి. 2021లో 2,698 కేసులు రిజిస్టర్​ కాగా.. వంద మందే దోషులుగా తేలారు. ఈ జాబితాలో 7,129 కేసులతో యూపీ టాప్ ప్లేస్​లో ఉంది. 2019తో పోలిస్తే 2021లో అక్కడ కేసులు కొద్దిగా తక్కువయ్యాయి. అక్కడ శిక్ష పడిన నిందితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.

మరోవైపు మన రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో పోక్సో కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. 2019లో 502, 2020లో 454, 2021లో 466 కేసులే నమోదయ్యాయి. మరోవైపు లైంగిక దాడులు, వేధింపులు సహా మిగ తా అన్ని నేరాలూ పిల్లలపై పెరుగుతున్నట్టు డేటా చెప్తున్నది. 2019లో 4,212 కేసులు నమోదు కాగా, అందులో 264 మందినే దోషులుగా తేల్చారు. ఆ మరుసటి ఏడాది 4,200 కేసులకు 470 మందిని, 2021లో 5,667 కేసులు నమోదైతే 674 మందినే దోషులుగా నిర్ధారించారు.

పిల్లలపై నేరాల విషయంలోనూ ఏపీ మెరుగ్గా ఉంది. 2021లో అక్కడ 2,669 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు మన రాష్ట్రంలో జువెనైల్ నేరస్థుల (దోషులుగా తేలిన వాళ్లు) సంఖ్య 34గా నమోదైంది. 2019 (12), 2020 (15)తో పోలిస్తే వీరి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువే పెరిగింది.

మహిళలే టార్గెట్‌‌‌‌

మహిళలను టార్గెట్‌‌‌‌గా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మూడేండ్లలో ఈ ఘటనలు భారీగా పెరిగాయి. ఈ విషయంలో రాష్ట్రం ఐదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో 2019లో 288 కేసులు నమోదైతే కేవలం ఒక్కరినే దోషిగా తేల్చడం గమనార్హం. 2020లో కేసుల సంఖ్య 649కి పెరిగింది. దోషులుగా తేలిన వాళ్ల సంఖ్య 16గా రికార్డయింది. 2021లో 883 కేసులు నమోదు కాగా.. ఒక్కరికే శిక్ష విధించారు.

చట్టాలున్నా దాడులు ఆగుతలే

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ విషయంలో తె లంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉండడం గమనార్హం. 2018లో 1,507, 2019లో 1,690, 2020లో 1,959, 2021లో 1,772 కేసులు నమోదయ్యాయి. షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం ఉన్నా రాష్ట్రంలో దళితులపై నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత రా ష్ట్రాలపైనే ఉందని కేంద్రం చెప్పింది. ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పిం చేందుకు బ్యూరో ఆఫ్​ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ శిక్షణ ఇస్తున్నామని పేర్కొంది.