బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు శుభవార్త... టెట్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ ... ఇవే వివరాలు

 బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు శుభవార్త... టెట్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ ... ఇవే వివరాలు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 27న వెల్లడించనున్నారు. అయితే, టెట్ పరీక్షకోసం  ఆగస్టు 2 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ధరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్ -1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్ -2తో పాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.

టెట్ పరీక్షకు ఈ దఫా పోటీ భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  రాష్ట్రంలో 1.5 లక్షల డీఈడీ, 4.5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు. 2017 టీఆర్‌టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. గతంలో టెట్‌కు ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేళ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కానీవారి సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. వీరితో పాటు కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన వారి సంఖ్య మరో 20 వేల వరకు ఉంటుంది. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది.

దరఖాస్తులు ప్రారంభం : ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు
రాత పరీక్ష : సెప్టెంబర్ 15
పేపర్ -1 : ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.
పేపర్ -2 : మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.
పరీక్ష ఫీజు : రూ. 400
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో (వెబ్‌సైట్‌ tstet.cgg.gov.in)