విద్యార్ధులకు శుభవార్త : ఇంటర్ లో తగ్గిన 30శాతం సిలబస్..ప్రకటించిన బోర్డ్

విద్యార్ధులకు శుభవార్త : ఇంటర్ లో తగ్గిన 30శాతం సిలబస్..ప్రకటించిన బోర్డ్

ఇంటర్ విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సీబీఎస్సీ సూచనల ప్రకారం సిలబస్ తగ్గించినట్లు ఇంటర్ బోర్డ్ చెప్పింది.

ఇంటర్ ఫస్ట్ ఈయర్ లో తెలుగు లో 30 శాతం సిలబస్, ఇంటర్ సెకండ్ ఇయర్ లో హిస్టరీ, ఏకానామిక్స్ , పొలిటికల్ సైన్స్ (సివిక్స్) , జియోగ్రఫి , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , కామర్స్ , అకౌంటెన్సీ సిలబస్ ను కుదిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

తగ్గించిన సిలబస్ 2020-21 కి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన ఇంటర్ సిలబస్ గురించి తెలుసుకోవాలంటే ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.