
దుబాయ్ : టీ20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా జూన్ 1న బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ ఆడనుందని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. వేదిక, సమయం తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. అమెరికా, యూఎస్‌ఏ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే 20 జట్లలో 17 జట్లు ఈ నెల 27 నుంచి జూన్1 వరకు వామప్ మ్యాచ్‌లు ఆడుతాయని ఐసీసీ వెల్లడించింది. మొత్తం 16 వామప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 29న సౌతాఫ్రికా ఫ్లోరిడాలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ లేకుండా నేరుగా మెయిన్ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి.