బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్– చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో సెమీఫైనల్ చేరుకున్నారు. యంగ్ స్టర్ మీరబా మైస్నమ్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ 21–-7, 21–-14 తో మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్– రాయ్ కింగ్ యప్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించారు.
విమెన్స్ డబుల్స్ సెమీస్‌లో అశ్విని–తనీషా జంట 21–-15, 21–-23, 21–-19 ఆరో సీడ్ లీ యు లిమ్– షెన్ సెంగ్ చాన్ (సౌత్ కొరియా)పై మూడు గేమ్స్ పాటు పోరాడి అద్భుత విజయం సాధించింది. అయితే, మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో ఇండియా యంగ్ షట్లర్ మీరబా లువాంగ్ మైస్నమ్ 12–-21, 5–-21తో థాయ్‌లాండ్ చెందిన స్టార్ షట్లర్ నాలుగో సీడ్ కున్లావుట్ విటిడ్సాన్ చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు.
