భారతీయ క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. గత కొంతకాలంగా మోడల్, నటి సమ్రీన్ కౌర్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వదంతులకు అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో పూర్తిగా తెరదించారు.
ప్రస్తుతం యూకేలో గడుపుతున్న అర్ష్‌దీప్, సమ్రీన్ కౌర్‌తో కలిసి దిగిన కొన్ని అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వాటికి మై పర్సన్ అనే క్యాప్షన్ జత చేసి హార్ట్ ఎమోజీని ఉంచడంతో ఈ జంట రిలేషన్‌షిప్‌పై క్లారిటీ వచ్చేసింది. అంతకుముందు ఐపీఎల్ 2026 సమయంలోనే వీరు ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి.
వ్యక్తిగత జీవితంలో కొత్త సంతోషాన్ని వెతుక్కున్న అర్ష్‌దీప్‌కు, క్రికెట్ మైదానంలో మాత్రం ఇటీవల కాలం అంతగా కలిసి రాలేదు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోగా.. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ టీమిండియా ప్రదర్శన నిరాశపరిచింది.
►ALSO READ | తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగు వికెట్లు తీసినప్పటికీ, వన్డేల్లో మాత్రం ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ, క్రికెట్ పిచ్ బయట మాత్రం అర్ష్‌దీప్ తన కొత్త ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సమ్రీన్ కౌర్ ఎవరు?
సమ్రీన్ కౌర్ పంజాబీ చిత్ర పరిశ్రమలో పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా, కపిల్ దేవ్ నాయకత్వంలోని 1983 వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కిన '83' సినిమాలో కూడా ఆమె ఒక పాత్రలో నటించారు.
