ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!

ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్  నిత్యం వార్తల్లో ఉంటున్నారు.  ముఖ్యంగా ఆమె డేటింగ్ వ్యవహారం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద దుమారమే నడించింది . అయితే ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మృణాల్ పై మరో వార్త చక్కళ్లు కొడుతోంది.

ఒకే కేఫేలో..

అదే టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్- మృణాల్ ఠాకూర్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ప్రముఖ 'బూజీ కేఫే' వద్ద  కనిపించడం.  ఈ కేఫేలో ఉన్నట్లు వీడియో ఒకటి నెట్టింట వైరల్అవుతోంది. దీంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది.  వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా.. మృణాల్ మాత్రం కేఫేలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి కనిపించిన దృశ్యాలు లేకపోయినా.. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఉండటం నెటిజన్లలో అనుమానాలకు తావిచ్చింది. దీంతో పలువురు ఫ్యాన్ పేజీలు ఈ వీడియోను 'కొత్త సెలబ్రిటీ జంట?' అనే క్యాప్షన్లతో షేర్ చేస్తున్నారు.

డేటింగ్ రూమర్స్.. 

అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ గానీ, యశస్వి జైస్వాల్ గానీ స్పందించలేదు. కొందరు మాత్రం ఇది డేటింగ్ కాదని, ఏదైనా యాడ్ షూట్, సినిమా ప్రమోషన్ లేదా బ్రాండ్ కొలాబరేషన్ కోసం కలిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒకే కేఫేలో కనిపించారనే కారణంతో ప్రేమలో ఉన్నారని నిర్ణయించడం సరైంది కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియో వైరల్

ఈ రూమర్లతో పాటు వీరిద్దరి వయసు తేడా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వయసు 33 సంవత్సరాలు కాగా, యశస్వి జైస్వాల్ 24 ఏళ్ల వయసులో ఉన్నాడు. దాదాపు తొమ్మిదేళ్ల వయసు తేడాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీ రిలేషన్‌షిప్‌లలో వయసు నిజంగా ముఖ్యమా? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ కేఫే వీడియో తప్ప.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని చెప్పే ఎలాంటి ఆధారాలు లేవు.   అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది.

ALSO READ :  కమర్షియల్ టచ్‌తో ఓటీటీలో సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్.. సస్పెన్స్ లవర్స్కు ఫుల్ మీల్స్ పక్కా!