సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ దొంగ… భారీగా నగదు, నగలు స్వాధీనం

సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ దొంగ… భారీగా నగదు, నగలు స్వాధీనం

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితుని నుండి 53 లక్షల 35 వేల నగదుతో పాటు 20 తులాల బంగారు నగలు, ఓ ఇంటికి సంబంధించిన 8 లక్షల 50 వేల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్స్, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జులై 3న హైదరాబాద్  అల్వాల్ లో ఒక దొంగతనం కేసు నమోదైంది. చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మేకల వంశీధర్ రెడ్డి పట్టుబడ్డాడు. నల్గొండ కు చెందిన ప్రధాన నిందితుడు మేకల వంశీధర్ రెడ్డి.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇప్పటి వరకు 72 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేసేవాడని… దొంగతనం చేసిన సొమ్ముతో విజయవాడలో ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం నలుగురుని అరెస్ట్ చేశారు. ఇందులో నిందితుని భార్యతో పాటు ఇద్దరు రిసీవర్ లను కూడా  అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మేకల వంశీధర్ రెడ్డి గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు పోలీసులు.