ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు వద్ద ..సీఆర్టీలను పర్మినెంట్ చేయాలి

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు వద్ద ..సీఆర్టీలను పర్మినెంట్ చేయాలి

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో 18 ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్టీ)ను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ టీచర్ల సంఘం జాతీయ కార్యదర్శి శివ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం మాసబ్​ ట్యాంక్​లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్​ ముందు కాంట్రాక్ట్ టీచర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ.. 2005 నుంచి 1,804 మంది కాంట్రాక్ట్ టీచర్లు ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్నారని, అందరినీ రెగ్యులర్ చేస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చినా.. 

ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా పర్మినెంట్ కావట్లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 22, 23 తేదీల్లో బంజారాహిల్స్​లోని గిరిజన బంజారా భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ టీచర్ల సంఘం అధ్యక్షుడు అజ్మీరా శివ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినీత్ రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సీమా నాయక్ పాల్గొన్నారు.