‘టీఆర్ఎస్ ఎంపీ బి.బి. పాటిల్ ఎన్నిక చెల్లదు’. కోర్టులో పిటిషన్

‘టీఆర్ఎస్ ఎంపీ బి.బి. పాటిల్ ఎన్నిక చెల్లదు’. కోర్టులో పిటిషన్

టీఆర్ఎస్ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బి.బి. పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ఆ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల్ని ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయనందున ఆయన ఎన్నిక చెల్లదంటూ మదన్ మోహన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

బీబీ పాటిల్ ఎన్నికల అఫిడవిట్ లో నిజాలు చెప్పలేదని మదన్ మోహన్ తరఫు సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ కోర్టులో తన వాదనలు వినిపించారు. తన పై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన విషయాలు వెల్లడించలేదని, అందుకే పాటిల్ తో పాటుఎన్నికల కమీషన్, టీఆరెస్ పార్టీలను ప్రతివాదులుగా చేర్చామని సల్మాన్ అన్నారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు నుంచి ఆరు వారల్లోపు కౌంటర్ ఫైల్ చేయాలని తెలిపింది.