ట్రంప్‌-కిమ్ మధ్య కుదరని ఒప్పందం

 ట్రంప్‌-కిమ్ మధ్య కుదరని ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఇవాళ (గురువారం) వియత్నాంలోని హనోయ్ లో మెట్రోపాల్‌ హోటల్‌ లీ క్లబ్‌లో వర్కింగ్‌ లంచ్‌ సమావేశం అయ్యారు. అయితే వారిద్దరు నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇద్దరి నేతల మధ్య అణు నిరాయుధీక‌ర‌ణ‌పై అగ్రిమెంట్ కుద‌ర‌కపోవడంతో…సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఉత్త‌ర కొరియాపై విధించిన ఆంక్ష‌ల అంశంలో రెండు దేశాల మ‌ధ్య భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అయిన‌ట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి శ్వేత సౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరి నేతల మధ్య వియత్నాంలోని హనోయ్‌లో గొప్ప, ర్మాణాత్మక సమావేశాలు జరిగాయని ఆ ప్రకటనలో తెలిపింది. అయితే కీలక అంశమైన అణ్వాయుధాల తగ్గింపునకు సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగలేదని తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారం కలిసి నిర్వ‌హించాల్సిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను ర‌ద్దు చేసి… ట్రంప్‌, కిమ్‌ హోటల్‌ నుంచి వెళ్లిపోయారు.