ఆ కంటైనర్‌‌లో దొరికిన 39 శవాలు చైనా వాళ్లవి: బ్రిటిష్‌‌ పోలీసులు

ఆ కంటైనర్‌‌లో దొరికిన 39 శవాలు చైనా వాళ్లవి: బ్రిటిష్‌‌ పోలీసులు

లండన్‌‌: రెండు రోజుల క్రితం లండన్‌‌లో ఓ కంటైనర్‌‌లో దొరికిన 39 డెడ్‌‌ బాడీస్‌‌ చైనాకు చెందిన వ్యక్తులవని పోలీసులు గురువారం తేల్చారు. అందులో 31 మంది మగవాళ్లవి కాగా, 8 మంది ఆడవాళ్లవని గుర్తించారు. వీరిని హత్య చేసినట్టు అనుమానిస్తున్న 25 ఏళ్ల డ్రైవర్‌‌ రాబిన్సన్‌‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండ్​, నార్త్‌‌ ఐర్లాండ్‌‌, బెల్జియం పోలీసులతోపాటు, నేషనల్‌‌ క్రైం ఏజెన్సీలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. మనుషులను అక్రమ రవాణా చేసే గ్రూపులు వీరి చావుకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

బల్గేరియా నుంచి బ్రిటన్‌‌కు వచ్చే హోలీహీడ్‌‌లోని వెల్ష్‌‌పోర్ట్‌‌ మార్గాన్ని రెగ్యులర్‌‌ ముఠాలు ఎంచుకోవని అభిప్రాయపడుతున్నారు. శవాలు దొరికిన కంటైనర్‌‌లో టెంపరేచర్‌‌ మైనస్‌‌ 25 డిగ్రీలు ఉంటుందని, అందులో ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్నారు. బాధితులను చనిపోయిన తర్వాత కంటైనర్‌‌లోకి చేర్చారా వంటి విషయాలు విచారణలో తేలుతాయన్నారు. కంటైనర్‌‌ ముందు భాగం ఉత్తర ఐర్లాండ్‌‌ నుంచి బయల్దేరి పర్‌‌ప్లీట్‌‌లో ట్రక్‌‌కు తగిలించుకుని వచ్చినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.