బిట్ కాయిన్ విరాళాలకు యునిసెఫ్ ఓకే

బిట్ కాయిన్ విరాళాలకు యునిసెఫ్ ఓకే

బ్లాక్ చైన్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న  క్రిప్టో కరెన్సీలైన బిట్ కాయిన్, ఈథర్ లను డొనేషన్లుగా అంగీకరిస్తున్నట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్  (యునిసెఫ్) ప్రకటించింది. దీని కోసం క్రిప్టో కరెన్సీ ఫండ్ ఏర్పాటు చేశామంది. తొలి డొనేషన్​ను ఈథరియమ్ ఫౌండేషన్ నుంచి అందుకోనుంది.

ప్రపంచంలోని స్కూళ్లను ఇంటర్నెట్​కు కనెక్ట్ చేసే గిగా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వీటిని వినియోగించనున్నట్లు చెప్పింది. క్రిప్టో కరెన్సీ డొనేషన్ ను ఓ దేశం కరెన్సీ కింద క్యాష్ చేసుకోబోమని, క్రిప్టో కరెన్సీ రూపంలోనే నిధులను వినియోగిస్తామని యునిసెఫ్​ చెబుతోంది.