సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్బీ) ఆధ్వర్యంలోని బేసిక్ తసర్ సిల్క్ వార్మ్ సీడ్ ఆర్గనైజేషన్ (బీటీఎస్ఎస్ఓ), బిలాస్‌పూర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: సెరికల్చర్ అసిస్టెంట్ (ఎస్ఏ).
మొత్తం ఖాళీలు: 15.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సెరికల్చర్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా మూడేళ్ల ఫుల్-టైమ్ డిగ్రీతోపాటు సెరికల్చర్‌లో పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. లేదా అగ్రికల్చర్ సైన్సెస్ లేదా ఫారెస్ట్రీలో నాలుగేళ్ల ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. లేదా బయలాజికల్ సైన్స్ (జువాలజీ, బాటనీ లేదా బయాలజీ)లో మూడేళ్ల ఫుల్-టైమ్ డిగ్రీతోపాటు సెరికల్చర్‌లో పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. లేదా బయలాజికల్ సైన్సెస్ (జువాలజీ, బాటనీ లేదా బయాలజీ)లో మూడేళ్ల ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ అర్హతతోపాటు సెరికల్చరల్ ప్రాజెక్ట్ వర్క్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 2026, నవంబర్ 6 నాటికి 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 6.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ csb.gov.inను సందర్శించండి.
