ఇన్వెస్ట్​మెంట్ పేరుతో..రూ.27లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ఇన్వెస్ట్​మెంట్ పేరుతో..రూ.27లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: ఇన్వెస్ట్​మెంట్​ పెడితే లాభాలు వస్తాయంటూ సిటీకి చెందిన వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి ఇటీవల ఆన్​లైన్​లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తమ ప్రొడక్ట్​పై ఇన్వెస్ట్​ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు మొదట కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్​చేయగా.. సదరు వ్యక్తి అతడికి లాభాలను చూపాడు.

 దీంతో బాధితుడు ఒకేసారి రూ.27 లక్షలు ఇన్వెస్ట్​ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.