ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు.

అరెస్టైన వారిని మెహదీపట్నంకి చెందిన మొహమ్మద్ అబ్రార్ హుస్సేన్(45), సయ్యద్ ఇన్సనెన్ మొహమ్మద్(28), ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంసింగ్ లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి మహాత్మ గాంధీ, వారణాశి కాశీ విద్యాపీఠిక్, అంబేద్కర్ యూనివర్సిటీ బీహార్ కి చెందిన నకిలీ విద్యా పత్రాలు, 2 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సులభంగా డబ్బు సంపాదించాలని వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఈ నకిలీ డిగ్రీ పత్రాలు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీటితోపాటు విదేశాలకు వెళ్లేవారికి కూడా నకిలీ సర్టిఫికేట్స్ కల్పిస్తామని చెప్పి.. ఒక్కొక్కరి దగ్గర నుండి  రూ.30 వేల నుండి రూ.40 వెలు వసూలు చేస్తున్నారని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా కన్సల్టెన్సీ ఏజెన్సీలకు విద్యా ధృవీకరణ పత్రాలను అందిస్తూ.. రూ.2 వేల నుంచి రూ.3 వేల  కమిషన్ తీసుకుంటున్నారని తెలిపారు. నిందితులపై 420,468,471 , r/w 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.