AIకి పనోళ్లుగా మనుషులు.. అడ్డా కూలీలుగా గంటకింతని పేమెంట్స్..!

AIకి పనోళ్లుగా మనుషులు.. అడ్డా కూలీలుగా గంటకింతని పేమెంట్స్..!

AI వల్ల కొన్ని ఉద్యోగాలకు.. తద్వారా ఉద్యోగులకు ఎసరు వచ్చి పడిన వాస్తవం. ఇప్పుడు తాజాగా AI మరో అడుగు ముందుకేసింది. మనుషులను AI అద్దెకు తీసుకుంటుంది. గంటకు ఇంత అని రేటు ఫిక్స్ చేసి మరీ రకరకాల పనులకు అద్దెకు ఇస్తుంది. వినడానికి వింతగా అనిపించినా ఇది పచ్చి నిజం. RentAHuman.ai అనే వెబ్సైట్లో లక్షా 15 వేల 684 మంది ఫ్రొఫెషనల్స్ను AI అద్దెకు ఇస్తుంది. అమెరికా, టర్కీ, బ్రెజిల్.. చివరికి పాకిస్తాన్ ప్రొఫెషనల్స్ కూడా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని AI కింద పనికి చేరారు.

AI వీళ్లకు గంటల లెక్కన కూలి ఇస్తుంది. చేసే పనిని బట్టి రేటు ఉంటుంది. ఉదాహరణకు.. ఇందులో అందుబాటులో ఉన్న ఒక డాక్టర్ గంటకు 300 డాలర్లకు రెంట్కు దొరుకుతాడు. వైద్య సాయం ఇంటికే కావాలని భావించే వాళ్లు ఇతనిని పనికి పిలవొచ్చు. వెబ్ డెవలపర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, అడ్వకెట్లు, టీచర్లు.. ఇలా ఏ ప్రొఫెషనల్ అయినా ఇందులో అద్దెకు దొరుకుతారు. ఈ  RentAHuman.aiలో ఇండియన్స్ ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. మనుషులు చేసే పనులకు సాయంగా ఉంటుందని AIని సృష్టిస్తే మనుషులనే పనోళ్లుగా మార్చి అదే మనుషులకు అద్దెకు ఇచ్చే స్థాయికి AI ఎదగడం విశేషం. మొన్నామధ్య వచ్చిన ఉపేంద్ర సినిమాలో చూపించినట్లు రోబోలు రాజ్యాలను పాలించే రోజులొస్తాయేమోనని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.

AI.. ఈ దశాబ్దంలో వచ్చిన అతిపెద్ద సాంకేతిక విప్లవం. AI అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన డైలీ రొటీన్‌‌‌‌‌‌‌‌లో భాగమైంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక టైంలో ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌ని వాడుతున్నారు. మనం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడే చాట్‌‌‌‌‌‌‌‌ జీపీటీ, గ్రోక్‌‌‌‌‌‌‌‌, జెమిని.. ఇవన్నీ  AI టూల్సే. ఇవి ప్రొడక్టివిటీ, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, క్రియేటివిటీ.. పెంచడంలో ఎంతో సాయం చేస్తాయి.