Kangana Ranaut: మోడ్రన్ 'ఇందిరమ్మ'లా కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!

Kangana Ranaut: మోడ్రన్ 'ఇందిరమ్మ'లా కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!

బాలీవుడ్ క్వీన్ కంగానా రనౌత్ అంటే ఒకప్పుడు కేవలం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తన ఆహార్యంలో తీసుకొచ్చిన మర్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా.. పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇవ్వకుండా కేవలం తన దుస్తుల ద్వారానే ఒక బలమైన రాజకీయ ముద్రను ఆమె వేస్తున్నారు. చేనేత చీరలు, లేద రంగులు, పక్కాగా కుదిరిన అవుటర్ వేర్ తో ఆకట్టుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఆమె భారరదేశపు రాజకీయ ఘన చరిత్రను తన ఫ్యాషన్ లోకి ఇమిడ్చినట్లు అనిపిస్తోందన్న అభిమప్రాయం వ్యక్తం అవుతోంది.. 

ఇందిరా గాంధీ వారసత్వానికి 'ట్రిబ్యూట్'

పార్లమెంట్ హాల్స్‌లో   ఒకప్పుడు ఇందిరా గాంధీ నడిచి వస్తుంటే ఆ గాంభీర్యంగా, తెల్లటి నూలు చీరల మెరుపుతో ఆకర్షంచేలా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ దశాబ్దాల తర్వాత అచ్చం అటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. అయితే ఇందిరా గాంధీ శైలి చాలా నిరాడంబరంగా ఉండేది.. కానీ కంగనా దానికి కొంత 'మోడ్రన్ టచ్' ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనా రనౌత్ ఫోటోలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్కైవ్ ఫోటోలు పక్కపక్కన పెట్టి చూస్తుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది కేవలం అనుకరణ (Imitation) కాదు, ఒక గొప్ప వారసత్వానికి ఇస్తున్న గౌరవంలా కనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కంగనా పవర్ డ్రెస్సింగ్

ఇందిరమ్మ తన వస్త్రధారణతో అధికారాన్ని ప్రదర్శించేవారు. ఇప్పుడు కంగనా కూడా అదే బాటలో సాగుతున్నారు. చేనేత బోర్డర్ ఉన్న కాటన్ చీరలు, సింపుల్ మోనోక్రోమ్ ప్యాలెట్స్, చలికాలంలో ధరించే లాంగ్ కోట్లు.. ఇవన్నీ ఇందిరా గాంధీ ఐకానిక్ పార్లమెంట్ లుక్స్‌ను గుర్తుచేస్తున్నాయి. కంగనా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్కైవ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందిరా గాంధీ శైలి చాలా నిరాడంబరంగా ఉండేది. కానీ కంగనా దానికి కొంత 'మోడ్రన్ టచ్' ఇస్తున్నారు. సంప్రదాయ చీరకట్టుకు షార్ప్ సిల్హౌట్స్ (Structured shapes), స్టైలిష్ బ్లేజర్స్ , తన ఫేవరెట్ హెర్మేస్ (Hermes) బ్యాగులను జతచేస్తూ ఒక కొత్త తరహా 'పార్లమెంట్ ఫ్యాషన్'ను సృష్టిస్తున్నారు. ఇది ఒక పాత శైలి పునరుద్ధరణ మాత్రమే కాదు, నేటి తరానికి తగినట్లుగా ఉందంటున్నారు. 

►ALSO READ | Chiranjeevi: టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన మెగాస్టార్.. 25 రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ఊహించని వసూళ్లు.

స్థిరత్వమే బలం

ఫ్యాషన్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. కంగనా గత కొన్ని నెలలుగా ఒకే విధమైన స్టైల్ లాంగ్వేజ్‌ను అనుసరిస్తున్నారు. ఒకే తరహా దుస్తులను పదేపదే ధరించడం ద్వారా తనకంటూ ఒక బలమైన ఐడెంటిటీని నిర్మించుకుంటున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంత ముఖ్యమో, ఒక నేత ఆహార్యంలోని స్థిరత్వం కూడా అంతే ముఖ్యం. దుస్తులు కేవలం అందం కోసమే కాదు, అవి ఒక సందేశాన్ని ఇస్తాయి. కంగనా రనౌత్ తన వస్త్రధారణ ద్వారా తాను ఒక బాధ్యతాయుతమైన, గంభీరమైన రాజకీయ నాయకురాలిని అని మౌనంగానే చాటిచెబుతున్నారు. క్వీన్ ఆఫ్ బాలీవుడ్ నుంచి క్వీన్ ఆఫ్ పార్లమెంట్ ఫ్యాషన్‌గా కంగనాను అభిమానులు ప్రశంసిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ans Not Com (@ansnotcom)