హైదరాబాద్: హైదరాబాద్లో ఫస్ట్ యాపిల్ రిటైల్ స్టోర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే.. ఈ యాపిల్ రిటైల్ స్టోర్లో ఉద్యోగాల కోసం సదరు సంస్థ నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ ఐ-ఫోన్ మేకర్ హైదరాబాద్ రిటైర్ స్టోర్లో స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం హైరింగ్ మొదలుపెట్టింది.
యాపిల్ సంస్థ స్టోర్ జాబ్స్ కోసం ఒక సంవత్సరం ముందు నుంచే అర్హత ఉన్న ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇస్తుంది. అంటే.. 2027 ప్రథమార్థంలో హైదరాబాద్ సిటీలో యాపిల్ రిటైర్ స్టోర్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో యాపిల్ రిటైల్ స్టోర్స్ ఇప్పటికే ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో కూడా 2027 మార్చి నాటికి యాపిల్ రిటైల్ స్టోర్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ యాపిల్ రిటైల్ స్టోర్ లొకేషన్ ఎక్కడంటే.. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్లో టీ స్క్వేర్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ డెస్టినేషన్ హైదరాబాద్లోని రాయదుర్గంలో ‘టీ స్క్వేర్’ పేరిట ఓ భారీ టవర్ను నిర్మించనుంది. ఈ బిల్డింగ్ లోనే యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టీ స్క్వేర్ 24 గంటల పాటు పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అందులో ఆపిల్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, వినియోగదారుల సౌలభ్యం కోసం యుటిలిటీ జోన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
టీ స్క్వేర్ద్వారా హైదరాబాద్ సిటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. అందులో భాగంగానే టీ స్క్వేర్ను మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ఆలోచిస్తున్నది. టీ స్క్వేర్ వల్ల ప్రజలకు ఉల్లాసం దక్కడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ సమకూరుతుంది. ఆ స్క్వేర్‌లో ఏర్పాటు చేసే వీడియో బిల్‌బోర్డులపై ప్రకటనలు, వచ్చి పోయే పర్యాటకులతో ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.
First Apple Store opening soon in Hyderabad!
— Hyderabad Real Estate & Infra (@HydREGuide) February 5, 2026
Based on recent job postings, Apple seems to be hiring for multiple roles for its first retail store in Hyderabad. The exact location is not confirmed yet.
A few months ago, the Hon. CM had hinted that T-Square could host premium… pic.twitter.com/d1bu41Tl9E
