బ్రెడ్ ఇష్టపడేవాళ్లు జాగ్రత్త... మనం ఆరోగ్యకరం అనుకుని తినే బ్రెడ్ గురించి పోషకాహార నిపుణులు కొన్ని షాకింగ్ నిజాలు చెబుతున్నారు. చాలామంది సాధారణ బ్రెడ్ కంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆరోగ్యకరమని నమ్ముతారు. కానీ మార్కెట్లో దొరికే అన్ని మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీరు అనుకున్నంత మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మల్టీగ్రెయిన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ధాన్యాలు వాడారని అర్థం. కానీ అవి తృణధాన్యాలా లేక శుద్ధి చేసిన పిండా అనేది గమనించాలి. చాలా కంపెనీలు ఎక్కువగా మైదాను వాడి, పైన కొద్దిగా ఓట్స్ లేదా విత్తనాలు చల్లి మల్టీగ్రెయిన్ అని లేబుల్ వేస్తాయి. ఇది రంగు మార్చిన తెల్ల బ్రెడ్ లాంటిదే. బ్రెడ్ మంచిగా బ్రౌన్ కలర్‌లో కనిపించడానికి కొన్నిసార్లు కారామెల్ వంటి కలర్స్, టెస్ట్ కోసం చక్కెరను కూడా కలుపుతారు.
వైట్ బ్రెడ్ వల్ల కలిగే నష్టాలు:
వైట్ బ్రెడ్ పూర్తిగా మైదా పిండితో తయారవుతుంది. ఇందులో ఫైబర్ ఉండదు. దీన్ని తినగానే శరీరంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది, దీనివల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు.
మంచి బ్రెడ్‌ను ఎలా గుర్తించాలి:
మీరు బ్రెడ్ కొనేటప్పుడు ప్యాకెట్ వెనుక పదార్థాల లిస్టులో మొదటి పేరు 100% తృణధాన్యాలు లేదా గోధుమ పిండి అని ఉండాలి. ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న బ్రెడ్ కడుపు నిండుగా ఉంచుతుంది ఇంకా షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. కలర్స్, ప్రిజర్వేటివ్స్ వంటి కెమికల్స్ తక్కువగా ఉన్నవి ఎంచుకోండి.
►ALSO READ | యాలకుల వెనుక ఉన్న అసలు రహస్యం: ఈ 5 చిట్కాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది..
బ్రెడ్ తినాలనుకుంటే సోర్‌డో బ్రెడ్.. సహజంగా ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఇంకా సాధారణ బ్రెడ్ కంటే మొలకెత్తిన ధాన్యాల బ్రెడ్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, త్వరగా అరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
