వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉంది

వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉంది

ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే పోలీసులు చ‌లానాలు వేయడం, చలానా చెల్లించకుంటే వాహనాలను జప్తు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే.. చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్‌ చేసే అధికారం మాత్రం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలుపుతూ ఇటీవల సోషల్‌ మీడియాలో  పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ప్ర‌చారం అవుతోన్న ఈ పోస్టులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు క్లారిటీని ఇచ్చారు. 

హైకోర్టు ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడ‌ద‌ని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం తమకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్ నిబంధ‌న‌లు-1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.