నిమ్మ తొక్కల్ని పడేస్తున్నారా..?

నిమ్మ తొక్కల్ని పడేస్తున్నారా..?

నిమ్మకాయల నుంచి రసం పిండిన తర్వాత నిమ్మ తొక్కల్ని పడేస్తుంటారు చాలామంది. అయితే,  డ్రెస్​ మీది కూరల మరకల్ని పోగొట్టడానికి, కిచెన్​లోని వాసన పోవడానికి నిమ్మతొక్కలు ఉపయోగపడతాయి. ఇంకా వీటిని ఇలా కూడా వాడొచ్చు...
తినేటప్పుడు ఒక్కోసారి డ్రెస్​ మీద కూర పడి, పసుపుపచ్చ మరకలు ఏర్పడతాయి. ఆ మరకలు మీద కొద్దిగా నిమ్మరసం పిండి, కొంచెం ఉప్పు చల్లి, నిమ్మతొక్కతో స్ర్కబ్బింగ్​ చేయాలి. తర్వాత ఆ డ్రెస్​ని ఎండలో పెట్టాలి. ఇలా రెండుమూడు సార్లు చేస్తే మరక పోతుంది.
మెటల్​తో చేసిన కళాకండాలు తొందరగా రంగు తగ్గినట్టు కనిపిస్తాయి. అలాంటప్పుడు వాటిని నిమ్మతొక్కతో రుద్ది, మూడునాలుగ్గంటలు ఎండలో ఉంచితే అవి మెరుస్తాయి. 
ప్లాస్టిక్​ వంట సామాన్లు ఎన్నిసార్లు తోమినా కూడా పచ్చగానే ఉంటాయి.  సగం టేబుల్​ స్పూన్​ బేకింగ్​ సోడా కలిపిన నిమ్మతొక్కతో ప్లాస్టిక్​ గిన్నెల్ని తోమాలి. 30 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగితే పసుపు రంగు పోతుంది.  
ఉల్లిగడ్డలు కోసినప్పుడు, వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసినప్పుడు చేతులు ఘాటు వాసన వస్తాయి. సబ్బుతో కడుక్కున్నా కూడా ఘాటు వాసన పోదు. అప్పుడు నిమ్మతొక్కతో చేతుల్ని రుద్దుకుంటే సరి.