సింగూరు నీళ్లను జాగ్రత్తగా  వాడుకుందాం..ప్రాజెక్టును సందర్శించిన సీఎస్ సంజయ్ జాజు

సింగూరు నీళ్లను జాగ్రత్తగా  వాడుకుందాం..ప్రాజెక్టును సందర్శించిన సీఎస్ సంజయ్ జాజు
  • ప్రాజెక్టును సందర్శించిన సీఎస్ సంజయ్​ జాజు
  • ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో, వర్షాభావం ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్షేత్రస్థాయి పరిశీలన
  • పంటల రక్షణకు రానున్న 15–20 రోజులే కీలకం
  • సింగూరు, మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచన
  •  

మెదక్/సంగారెడ్డి/పుల్కల్, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించారు. తాగునీటి అవసరాలకు నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంటలను కాపాడేందుకు వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

నాలుగు జిల్లాలకు తాగునీటి ప్లాన్‌‌

పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వాటర్ ట్రీట్‌‌మెంట్ ప్లాంట్ వద్ద సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌‌కో సీఎండీ జితేశ్ వి. పాటిల్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో పాటు నీటి పారుదల, ఆర్‌‌డబ్ల్యూఎస్, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ సీఎస్‌‌కు వివరించారు. సింగూరు, మంజీరా  జ లాశయాల్లోని నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వి నియోగించుకోవాలని సీఎస్ సూచించారు. ఆగుమెంటేషన్ పనులను నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని స రఫరా చేయాలని, బోర్‌‌వెల్స్‌‌ను కిరాయికి తీసుకోవాలని చెప్పారు.

పంటల రక్షణపై దృష్టి

పంటలను కాపాడేందుకు రానున్న 15–20 రోజులు కీలకమని సీఎస్ తెలిపారు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌‌ఫార్మర్లపై అధిక భారం పడకుండా చూడాలన్నారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీబీజీ రామ్ జీ కింద నీటి సంరక్షణ పనులు చేపట్టడంతో పాటు నీటి నిల్వ కుంటలు నిర్మించాలని చెప్పారు.

భూగర్భ జలమట్టాలు తగ్గడంతో విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్‌‌కో సీఎండీ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. తక్కువ నీరు అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల సాగుతో పాటు కోళ్లు, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం చౌటకూర్ మండలం సుల్తాన్‌‌పూర్‌‌లో గొల్ల మహేశ్ ఏడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను సీఎస్ పరిశీలించారు. వర్షాలు లేక దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతు వివరించారు. వర్షలోటు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు సాగు చేయాలని సీఎస్ సూచించారు.