గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్​

గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్​

సిద్దిపేట రూరల్, వెలుగు : ఫుడ్​పాయిజనింగ్​తో 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​లో శుక్రవారం రాత్రి సొరకాయ, సాంబారు, పెరుగుతో భోజనం చేసిన స్టూడెంట్స్ అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు, విరేచనాలు కాగా, మరికొందరికి కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తాయి.

శనివారం ఉదయం నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన డీఎంహెచ్​వో కాశీనాథ్​ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నారు. 22 మందికి అక్కడే చికిత్స ప్రారంభించారు. నలుగురిని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అనంతరం హాస్టల్ కు తీసుకువచ్చారు. అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ శనివారం సాయంత్రం స్కూల్ ను సందర్శించారు. పిల్లలకు పూర్తిగా నయం అయ్యేవరకు మెడికల్ సిబ్బంది అక్కడే ఉండాలని ఆదేశించారు.