Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్స్ దీపికా పాడుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. ఇండియన్ మైథలాజి కాన్సెప్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుండి తాజాగా బుజ్జి అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ పాత్రకు సంబంధించిన పూర్తి వీడియోను మే 22 విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక ఈవెంట్ కూడా నిర్వహించనున్నారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కల్కి సినిమా నుండి మొదటి పాటను కూడా అదే స్టేజి పై విడుదల చేయనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.     

ఇక కల్కి సినిమా విడుదల నేపధ్యంలో వరుసగా వస్తున్న అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోందని, ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్దామా పాత్రలో కనిపిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నారు. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ లో అంచనాలు పెంచుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.