కరోనా అనుమానం : ఫీవర్, గాంధీల్లో చేరిన 9 మంది

కరోనా అనుమానం : ఫీవర్, గాంధీల్లో చేరిన 9 మంది

హైదరాబాద్​, వెలుగు: చైనాకు చెందిన 9 మంది కరోనా అనుమానంతో ఆస్పత్రుల్లో చేరారు. ఏడుగురు ఫీవర్​ హాస్పిటల్​లో, ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఫీవర్​లో చేరిన వాళ్లకు కరోనా లక్షణాల్లేవని, ముందు జాగ్రత్తగా వాళ్ల బ్లడ్​ శాంపిళ్ల టెస్టులకు పంపామని హాస్పిటల్​ సూపరింటెండెంట్ శంకర్​ తెలిపారు. వాళ్లంతా జనవరి 31న చైనా నుంచి ఇండియాకు వచ్చారన్నారు. ఇటు గాంధీలోనూ ఇద్దరు చైనీయులు సహా 11 మంది కరోనా అనుమానంతో చేరారు. వాళ్లకూ కరోనా లక్షణాలు లేవని, వాళ్లంతా చైనాకు వెళ్లి రావడంతో శాంపిళ్లు సేకరించి టెస్టులు చేస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. గాంధీలోని 11 మంది, ఫీవర్​ ఆస్పత్రిలోని 9 మంది టెస్టుల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ చెప్పింది. ఇప్పటిదాకా 57 మందికి టెస్టులు చేయించగా 37 మందికి కరోనా నెగెటివ్​గా తేలింది. కాగా, శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ  ఎయిర్​పోర్టులో కరోనా  స్క్రీనింగ్​ కొనసాగుతోంది. ఇప్పటికే వైరస్​ ప్రభావిత దేశాల నుంచి వస్తున్న వారిని థర్మల్​ స్కానింగ్​ చేస్తున్నారు. ఎయిర్​పోర్టులో ఆయుష్​ డిపార్ట్​మెంట్​ స్టాల్​ను స్టార్ట్‌‌ చేశారు. ఆయుష్​ మినిస్ట్రీ సూచన మేరకు ‘ఆర్సెనిక్​ ఆల్బమ్​ 30’ మందుల పంపిణీని  ప్రారంభించారు. వాటిని వేసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి వైరస్​లు దరిచేరవని అధికారులు చెబుతున్నారు. వెల్లుల్లి గాని, నువ్వుల నూనె గాని కరోనా చికిత్సకు పని చేయవని డబ్ల్యూహెచ్‌‌వో స్పష్టం చేసింది.