పాతబస్తీలో తప్పిన పెను ప్రమాదం.. కూలిపోయేందుకు సిద్ధంగా నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్

పాతబస్తీలో తప్పిన పెను ప్రమాదం.. కూలిపోయేందుకు సిద్ధంగా నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్

హైదరాబాద్ పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఓవైపు ఒరిగింది. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు సొసైటీ, లక్కీబార్ సమీపంలో కూలిపోవడానికి బిల్డింగ్ సిద్ధంగా ఉండడంతో స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటు విషయం తెలియగానే స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ హుసేనిపాషా ఘటనా స్థలానికి వెళ్లారు. 

జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించారు. బిల్డింగ్ పక్కనే ఉన్న స్థానికులను ఖాళీ చేయించారు. బిల్డింగ్ చుట్టూ బారికేట్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపై తాళ్లు కట్టి.. రాకపోకలను నిలిపివేశారు. ఏ క్షణంలో అయినా బిల్డింగ్ కూలేపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.