Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!

Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!

 

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించిన ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ సినిమాలో యాక్టర్, రైటర్, డైరెక్టర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మలయాళ స్టార్ హీరో దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న SSMB 29లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారట. ఈ విషయమై పృథ్వీరాజ్‌ను డైరెక్టర్ రాజమౌళి సంప్రదించారని..అందుకు ఆయన కూడా ఓకే చేసినట్లు సినీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

SSMB 29లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా కనిపించనున్నారట. త్వరలో దీనిపై మేకర్స్ నుంచి అఫిసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మహేష్ తో పృథ్వీరాజ్‌ విలన్ గా ఎలా ఉండబోతున్నాడనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. ఎందుకంటే, రాజమౌళి సినిమాలంటే విలన్ కి..హీరోల కంటే బలమైన పాత్ర ఉంటుంది. మరి ఇందులో సూపర్ స్టార్ కి ధీటైన పాత్రలో పృథ్వీరాజ్‌ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. 

రీసెంట్గా పృథ్వీరాజ్ ది గోట్ లైఫ్ మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పృథ్విరాజ్ ప్రస్తుతం మలయాళ స్టార్ మోహన్ లాల్తో లూసిఫర్ రీమేక్ను (L2) తెరకెక్కిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్..రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్టు సమాచారం. 

SSMB 29 విషయానికి వస్తే..ఇప్పటికే SSMB 29 కోసం పలుభాషల నుండి నటీనటుల ఎంపిక  ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను, థీమ్ ను రాజమౌళి ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహేశ్‌కు సంబంధించిన విభిన్నమైన ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసినట్లు సినీ సర్కిల్ లో టాక్‌ వినిపిస్తోంది.