T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ రోజు కోల్‌కతాలో భారత్–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీఫైనల్‌కు చేరుకోగా, ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక పోరుకు ముందు పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ సెమీఫైనల్‌కు చేరదని మరోసారి పిచ్చి కూతలు కూశాడు. టీమిండియాపై అతను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
కాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సహచరుడు అహ్మద్ షెహజాద్ మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ను భారత్ ఓడించి సెమీఫైనల్‌కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రెండు జట్లు కూడా రెండేసి పాయింట్లతో ఈక్వెల్ గా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టే నేరుగా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడిన జట్టు టోర్నీకి వీడ్కోలు చెబుతుంది అన్నాడు. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, రెండు జట్లకూ ఒక్కో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్, వెస్టిండీస్ రెండూ మూడు పాయింట్లతో ముగుస్తాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా వెస్టిండీస్ సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
వెస్టిండీస్ పై భారతదేశం మ్యాచ్ గెలిస్తే, అమీర్ నుంచి 'జ్యోతిష్యుడు' బిరుదును తీసుకుంటామని అహ్మద్ షెహజాద్ తెలిపారు. కాగా భారత్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే, నేను ఈ షో నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాను తేల్చి చెప్పాడు. మరోవైపు, కోల్‌కతాలో ప్రస్తుతం వాతావరణం నార్మల్ గా ఉంది. వర్షం పడే సూచనలు లేవు అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం సమయంలో కొంచెం డ్యూ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఇరు జట్ల అంచనా:
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, రోవ్‌మన్ పావెల్, రోస్టన్ చేజ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, జేడెన్ సీల్స్
