ఆయతొల్లా అలి ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్ గా 36 ఏళ్లు అప్రతిహాతంగా పాలించిన నేత. అంతర్యుద్ధాలు ఎన్ని వచ్చినా.. పొరుగు దేశాల నుంచి ఎంత వైరం ఉన్నా.. మిడిల్ ఈస్ట్ ను ప్రభావితం చేస్తూనే.. ఇరాన్ లో తిరుగులేని శక్తిగా ఆయన పాలన కొనసాగింది. అలాంటి అగ్రనేత అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మృతి చెందాడు. దీంతో ఆయన తదుపరి వారసులు ఎవరు..? అనే చర్చ నడుస్తోంది.
ఖమేనీ మృతితో ఇరాన్ లో పరిపాలనలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో.. ఇరాన్ ఇస్లామిక్ రివొల్యూషనరీ కార్ప్స్ మాత్రం అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
ఇదే సమయంలో ఇరాన్ పాలన చేజిక్కించుకునేందుకు రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రయత్నాలు మొదలెట్టాయి. అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత.. ప్రతిపక్ష నేత మర్యం రజవీ తో పాటు ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లావీ.. దేశ ప్రజలకు సందేశం పంపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్ గురించిన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే.. ఆధుని ఇరాన్ నిర్మాణం కోసం దేశ ప్రజలంతా ఒక్కటి క కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇరాన్ తన కొత్త నాయకుడిని నిర్ణయించే వరకు ఇరాన్ అధినేత ఎవరనేది లీడర్ షిప్ కౌన్సిల్ నిర్ణయిస్తున్ట్లు చెప్పారు. న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక న్యాయవాదితో కూడిన నాయకత్వ మండలి తాత్కాలికంగా ఇరాన్ అత్యున్నత నాయకుడి విధులను స్వీకరిస్తుందని ఇరాన్ వార్తా సంస్థ IRNA నివేదించింది.
ఇరాన్ కొత్త నాయకుడి గురించి ట్రంప్ ఏమన్నారు..?
ఇరాన్ సుప్రీం లీడర్ హత్యకు గురయ్యాడనిని తన ట్రూత్ సోషల్‌లో ప్రకటించిన తర్వాత , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌కు నాయకత్వం వహించడానికి కొంతమంది మంచి అభ్యర్థులు ఉన్నారని అన్నారు.CBS న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో.. నాకు ఎవరో ఖచ్చితంగా తెలుసు, కానీ నేను మీకు చెప్పలేను.. అని ట్రంప్ అన్నాడు.
ఇరాన్ తదుపరి నాయకుడు ఎవరు? ఖమేనీ వారసత్వాన్ని పుచ్చుకునే హక్కు ఎవదిరి..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఖమేనీ కూడా తన వారసుడు ఎవరో ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు, కానీ అతని రెండవ పెద్ద కుమారుడు మోజ్తాబా ఖమేనీ చాలా కాలంగా ఇస్లామిక్ పాలనకు వారసుడిగా కనిపిస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది.
విపక్షాల నుంచి ఇద్దరి పేర్లు..
మర్యం రజావీ:
ఒకప్పటి ఇరాన్ రాజవంశీయులు, పారిస్ లో ఉంటున్న రజావీ మొదటగా వినిపిస్తున్న పేరు. పారిస్ లో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (NCRI) అనే సంస్థకు అధ్యక్షురాలుగా ఉన్న రజావీ.. ఇరాన్ లో మతాధికారుల పాలనను అంతం చేసి ప్రజాస్వామ్య రాజ్యంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందంటూ ప్రజలకు సందేశం పంపారు.
ఫాసిస్టుల చేతిలో దేశం ఎంతో పీడనను, ఎంతో నష్టాన్ని చవిచూసింది.. అంటూ ఆమె పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. దేశంలో ఉన్న అనిశ్చితికి వ్యతిరేకంగా ధైర్యవంతులైన యువత పోరాటం చేయాల్సి అవసరం ఉందని అన్నారు.
ఇరాన్ ను 1979 లో ఇస్లామిక్ స్టేట్ గా ప్రకటించిన తర్వాత.. NCRI ని స్థాపించగా.. బహిష్కరణకు గురైన ప్రభుత్వం అంటూ ఆ సంస్థను విదేశాల నుంచి నడిపిస్తున్నారు. ఇరాన్ మార్పుతో కూడిన పాలన కోసం 6 నెలల బ్లూప్రింట్ సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించారు. సోదరభావంతో మెలగాల్సిన సమయం.. షాలను, ముల్లాలను తిరస్కరించాల్సిన సందర్భం.. అంటూ సందేశంలో పేర్కొన్నారు.
రెజా పహ్లావీ...
మరోవైపు ఇరాన్ చివరి చక్రవర్తి వారసుడు రెజా పహ్లావీ కూడా ఇరాన్ కు కాబోయే అధినేతగా ప్రకటించుకుంటున్నాడు. ఖమేనీ హతం తర్వాత.. ఇస్లాం రాజ్యం కూలితే.. ఇరాన్ ను ప్రజాస్వామిక దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్తున్నారు. ఇరాన్ పై అమెరికా దాడులను.. మానవతావాద జోక్యంగా అభివర్ణిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఇద్దరు నేతలు పోటీ పడి ప్రకటనలు చేస్తూనే.. ఆర్మీ కి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు మిలిటరీ, సెక్యూరిటీ దళాలు సహకరించాలని కోరారు. అధికార మార్పిడికి సహకరించాలని సందేశం పంపారు.
ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్స్ కాప్స్, ఇతర భద్రతా దళాలు ఆయుధాలు వీడి.. ప్రజల వైపు రావాలని రజావీ పిలుపునిచ్చారు. మరోవైపు పహ్లావీ.. భద్రతా అధికారులు.. ఖమేనీతో పాటు అదే పడవలో మునిగిపోతారని హెచ్చరికలు జారీ చేశారు.
ఖమేనీ వారుసులు అధికారాన్ని చేజిక్కించుకునే ముప్పు
మోజ్తాబా ఖమేనీ:
ఖమేనీ అంతమవటంతో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఖమేనీ తన వారసుడు ఎవరో ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు, కానీ అతని రెండవ పెద్ద కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఇస్లామిక్ పాలనకు హేతుబద్ధమైన వారసుడిగా చాలా కాలంగా చూస్తున్నారని రాయిటర్స్ అభిప్రాయపడింది. మోజ్తాబా ఖమేనీ (56 ) తన తండ్రి కఠిన విధానాలకు అనుగుణంగా.. వాటిని కొనసాగించే విధంగా ఉన్నట్లు అంతర్గత వర్గాలు మీడియాకు తెలిపాయి.
హసన్ ఖమేనీ:
ఇరాన్ అధికారాన్ని ఆశిస్తున్న వారిలో ఇస్లామిక్ విప్లవ పితామహుడు రుహోల్లా ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హసన్ ఖమేనీ (53) ఇటీవలే తను కూడా పోటీలో ఉన్నట్లు స్ట్రాంగ్ మెసేజ్ ను పంపుతున్నాడు.
