వర్సటైల్ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘తడయం’ (Thadayam). ‘క్లూ’ అనే అర్థం వచ్చే ఈ టైటిల్‌కు న్యాయం చేసేలా, ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠను రెట్టింపు చేస్తూ ఈ సిరీస్ సాగుతుంది. శివద, నిశివద, మున్నార్ రమేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ZEE5లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.
1999లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్, మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలోకి లాగేస్తుంది. ఇందులో సముద్రఖని SI అధియామాన్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో నవీన్‌కుమార్ పళనివేల్ అద్భుతంగా తెరకెక్కించాడు. అర్థరాత్రి హత్యలు చేసే సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ సముద్రఖని చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ తడయం వెబ్ సిరీస్ ను అజయ్ కృష్ణ నిర్మించాడు. నవీన్ కుమార్ పళనివేల్ డైరెక్ట్ చేశాడు. మూడేళ్ల కిందట కూడా ఇదే పేరుతో మరో వెబ్ సిరీస్ రావడం విశేషం.
The hunt begins with a blockbuster start!🔥
— ZEE5 Tamil (@ZEE5Tamil) February 28, 2026
Samuthirakani's 1st ever web-series #Thadayam Is Now Streaming On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #WatchOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/7F02MG3zOn
కథేంటంటే:
ఈ కథ ఆంధ్రప్రదేశ్– తమిళనాడు సరిహద్దులోని తిరువళ్లూరుకు దగ్గర్లో ఉన్న పొడతూర్‌పేటలో 1995లో జరిగే ఒక భయంకరమైన హత్యతో మొదలవుతుంది. 1996 –1999 మధ్య మళ్లీ అదే ప్యాట్రెన్‌లో వరుస హత్యలు జరుగుతాయి. అవి దోపిడీ కోసం చేసినవి కాదు. కిల్లర్స్ హత్య చేసి మగవారి నడుము గొలుసు, ఆడవారి మంగళసూత్రం మాత్రమే తీసుకుంటారు.
►ALSO READ | స్వగ్రామానికి విజయ్–రష్మిక దంపతులు: తుమ్మన్ పేటలో ప్రత్యేక పూజలు.. ముస్తాబవుతున్న దేవరకొండ వారి ఇల్లు
అదే ప్లేస్‌లో రక్తంతో ‘‘?’’(ప్రశ్నార్థకం గుర్తు) రాసి వెళ్లిపోతారు. పోలీసులు అది సీరియల్ కిల్లర్స్ పనే అని నిర్ధారిస్తారు. అధియమాన్ (సముద్రఖని) పోలీసింగ్‌ని థ్యాంక్‌లెస్ జాబ్ అని భావించి, వాలంటరీ రిటైర్‌మెంట్ కోసం అప్లై చేసిన సీనియర్ సబ్‌ఇన్‌స్పెక్టర్. అతను పోలీస్ స్టేషన్‌లో కంటే టీ దుకాణంలోనే ఎక్కువ టైం గడుపుతుంటాడు.
అదే పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ లక్ష్మి (శివద) జాయిన్ అవుతుంది. ఇద్దరూ కలిసి ఈ హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. మొత్తంగా 77 హత్యలు జరిగినట్టు తేలుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? వాళ్లు కిల్లర్స్‌ని పట్టుకున్నారా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? చివరికి పోలీసులు విజయం సాధించారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలే మిగిలిన కథ.
ఎలా ఉందంటే?
ఈ సిరీస్ బలమే స్క్రీన్‌ప్లే. దర్శకుడు నవీన్ కుమార్ పళనివేల్ ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా, కథను రా అండ్ రియలిస్టిక్‌గా నడిపించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే క్లిఫ్‌హ్యాంగర్ ‘నెక్స్ట్ ఎపిసోడ్’ చూడాలనే ఉత్సుకతను పెంచుతుంది.
సముద్రఖని నటన మరోసారి ఆయన ఎందుకు వర్సటైల్ యాక్టర్ అనిపిస్తుందో నిరూపిస్తుంది. కళ్లతోనే భావాలు పలికించడం ఆయన ప్రత్యేకత. శివద పాత్రకు మంచి స్కోప్ దొరికింది. ఆమె క్యారెక్టర్ కేవలం సపోర్టింగ్ రోల్‌లా కాకుండా, ఇన్వెస్టిగేషన్‌లో కీలకంగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నైట్ సీన్స్‌లో లైటింగ్, లోకేషన్స్.. ఇలా అన్నీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తాయి. చూడకపోతే చూసెయ్యండి.. డోంట్ మిస్..
