T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ పై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. భారత్ జట్టు సరైన సమయంలో ఫామ్ అందుకున్నప్పటికీ, ఇప్పుడు ఎదురయ్యే నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రయోగాలు చేయకుండా అదే జట్టుతో ముందుకు కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలనే ఆలోచన వద్దని తెలిపారు. ఇప్పుడు ప్రతి మ్యాచ్ నాకౌట్‌లాంటిదే. ఈ సమయంలో మార్పులు చేయడం అవసరం లేదని ఆకాశ్ చోప్రా సూచించాడు.
జింబాబ్వేపై భారీ విజయం:
భారత్ జట్టు జింబాబ్వేపై టీమిండియా 256/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది ఈ టోర్నీలోనే అత్యధిక స్కోర్.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగం సమతుల్యంగా కనిపించింది. సంజు శాంసన్ ఓపెనింగ్‌లో మంచి ఆరంభం ఇవ్వగా, అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా అర్ధశతకం బాదగా, తిలక్ వర్మ (44*) పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కాగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే వెస్టిండీస్ మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై వంటిది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ పోరు ఫిక్స్ అవుతుంది. ఓడిపోతే టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
భారత జట్టు అంచనా: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
